ఆధ్యాత్మికం

దీపం ఇలా వెలిగిస్తే.. సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..

కార్తీక మాసంలో సాధారణంగా చాలా మంది రోజూ దీపారాధన చేస్తుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం వెలిగిస్తారు. ఇలా ఈ మాసం మొత్తం చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం కూడా కొందరు దీపారాధన చేస్తారు. ఇక కొందరు కార్తీక మాసం కాకపోయినా రోజూ దీపారాధన చేస్తూనే ఉంటారు. అయితే దీపారాధన చేసే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించి చేస్తే ఇష్టదైవం అనుగ్రహం లభిస్తుంది. దీపారాధన చేసే విషయంలో ఉండే ఆ నియమాలు ఏమిటంటే..

పంచలోహాలు, వెండి, మట్టి వంటి పదార్థాలతో తయారు చేసిన ప్రమిదల్లో మాత్రమే దీపం వెలిగించాలి. నిత్య పూజకు మట్టి ప్రమిదల కన్నా లోహపు ప్రమిదలు అయితే మంచిది. తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే మంచిది. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మిని స్మరించాలి. దీంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. శనిగ్రహ దోష నివారణ అవుతుంది. అదే ఉత్తరం దిశగా దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి కలుగుతాయి. దక్షిణం వైపున దీపాన్ని వెలిగించరాదు. ఆ దిక్కున చనిపోయిన వారికి దీపం పెడతారు. కనుక ఆ వైపు దీపం పెట్టరాదు. పెడితే అన్నీ అపశకునాలే ఎదురవుతాయి. కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి.

lit deepam like this for luck and wealth

ఇక దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులను వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. తెల్లని కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి ఆ తరువాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. మంచి జరుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే.. ఎంతో శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు.

దీపం వెలిగించడానికి ఆవు నెయ్యిని వాడాలి. లేదా నువ్వుల నూనెను అయినా వాడుకోవచ్చు. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడితే ఆరోగ్యం మెరుగు పడుతుంది. 48 రోజుల పాటు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే పల్లి నూనెతో మాత్రం దీపారాధన చేయకూడదు. ఇలా పలు నియమాలను పాటిస్తే దైవం అనుగ్రహం కలుగుతుంది. అనుకున్నవి నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts