Murukulu : ఎక్కువ నూనె అవ‌స‌రం లేకుండానే.. మురుకుల‌ను ఇలా చేయండి.. భ‌లే రుచిగా ఉంటాయి..

Murukulu : మ‌నం పండ‌గ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే పిండి వంట‌ల్లో మురుకులు కూడా ఒక‌టి. మురుకుల మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రూ ఎంత ప్ర‌య‌త్నించినా కూడా మురుకుల‌ను క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. ఈ మురుకుల‌ను రుచిగా అలాగే క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మురుకుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – రెండున్న‌ర క‌ప్పులు, పుట్నాల ప‌ప్పు – ముప్పావు క‌ప్పు, నువ్వులు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, బ‌ట‌ర్ – 25 గ్రా., నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

మురుకుల తయారీ విధానం..

మురుకుల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక జార్ లో పుట్నాల ప‌ప్పును తీసుకోవాలి. వీటిని మెత్త‌గా పొడి అయ్యేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, కారం, బ‌ట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి. బ‌ట‌ర్ అందుబాటులో లేని వారు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి కూడా వేసుకోవ‌చ్చు. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. పిండిని క‌లుపుకున్న త‌రువాత దానిపై త‌డి వ‌స్త్రాన్ని వేసి ప‌ది నిమిషాల పాటు నాననివ్వాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసి అందులో మ‌ధ్య‌స్థ ప‌రిమాణంలో రంధ్రాలు ఉన్న బిళ్ల‌ను ఉంచాలి. త‌రువాత అందులో త‌గినంత పిండిని ఉంచాలి.

make Murukulu in this method without much oil
Murukulu

నూనె మ‌ధ్య‌స్థంగా వేడి అయిన తరువాత మంట‌ను చిన్న‌గా చేసి మురుకుల‌ను వ‌త్తుకోవాలి. మురుకుల‌ను నేరుగా నూనెలో వ‌త్తుకోవ‌డం రావ‌డం రాని వారు ఒక చిల్లుల గంటెను తీసుకుని దానికి వెనుక వైపు నూనె రాసి దాని పైన మురుకుల‌ను వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఇలా మురుకుల‌ను వ‌త్తుకున్న తరువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి మురుకుల‌ను కాల్చుకోవాలి. ఈ మురుకుల‌ను అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే మురుకులు త‌యార‌వుతాయి. మురుకుల‌ను మ‌రీ ఎక్కువ‌గా వేయిస్తే గట్టిగా త‌యార‌వుతాయి క‌నుక అవి రంగుమారగానే నూనె నుండి తీసివేయాలి. ఈ మురుకుల‌ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 20 రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా మురుకుల‌ను చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు.

D

Recent Posts