Cumin Ajwain Powder : దీన్ని రోజూ ఒక్క స్పూన్ తీసుకోండి చాలు.. స‌క‌ల రోగాలు మాయం అవుతాయి..

Cumin Ajwain Powder : ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఉన్నా కూడా ఆయుర్వేదంలో స‌ర్వ‌రోగ నివారిణి ఒక‌టుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల 90 శాతం రోగాలు దూర‌మ‌వుతాయి. ఈ పొడిని ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ పొడిని ఏ వ‌య‌సు వారైనా తీసుకోవ‌చ్చు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాలు మ‌ల‌మూత్రాల ద్వారా, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌తో ఈ పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే ఈ పొడిని ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక క‌ప్పు వామును, ఒక క‌ప్పు జీల‌క‌ర్ర‌ను, ఒక క‌ప్పు మెంతుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో వామును తీసుకుని వేడి చేయాలి. వాము వేగిన త‌రువాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే విధంగా జీల‌క‌ర్ర‌ను, మెంతుల‌ను కూడా వేయించి అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవ‌చ్చు. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి రోజూ రాత్రి తాగాలి. వేడి నీటిలో మాత్ర‌మే ఈ పొడిని క‌లిపి తాగాలి. ఈ పొడిని తీసుకున్న అర‌గంట త‌రువాత మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. చ‌ర్మం పై ఉండే ముడ‌తలు తొల‌గిపోతాయి.

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధ‌ప‌డే వారు ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల‌ను పొడిగా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృడంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం శాశ్వ‌తంగా దూరం అవుతుంది. దీర్ఘ‌కాలికంగా వేధిస్తున్న ద‌గ్గు త‌గ్గుతుంది. గుండె ప‌నితీరు మెరుగుప‌డుతుంది. వినికిడి శ‌క్తి పెరుగుతుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. దంత సంబంధిత స‌మ‌స్యలు త‌గ్గుతాయి. మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారు ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Cumin Ajwain Powder take daily one spoon for these benefits
Cumin Ajwain Powder

ఈ పొడిని ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌ల పాటు వాడాలి. అప్పుడే మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే దీనిని మ‌ర‌లా వాడాల‌నుకునే వారు ముందుగా మూడు నెల‌లు వాడిన త‌రువాత ఒక నెల మానేసి మ‌ర‌లా మూడు నెల‌లు తీసుకోవాలి. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts