Malavika Mohanan : సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్‌ను ఒలకబోసే మాళవిక మోహనన్ సినిమాల్లోనూ బిజీగా ఉంటోంది. రజనీకాంత్ నటించిన పేట సినిమాతోపాటు తమిళ స్టార్ నటుడు విజయ్ తో కలిసి మాస్టర్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. అందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా ఈమె చేసిన పని పట్ల నెటిజన్లు ఫైరవుతున్నారు. ఆమె చేసిన పనికి ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా మాళవిక మోహనన్ ముందు రోజు ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన ప్రియుడితో ఆమె మాట్లాడినట్లు.. అతనికి ఐ లవ్ యూ చెప్పినట్లు ఉంది. దీంతో అతను ఎవరు.. అనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తిని చూపించారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే రోజు కోసం వారు ఎదురు చూశారు. ఆ రోజు ఆమె తన ప్రియుడి గురించి చెబుతుందేమోనని ఆశగా వేచి చూశారు. అయితే మాళవిక మోహనన్ మాత్రం ఊరించి ఉసూరుమనిపించింది. తన ప్రియుడి గురించి చెప్పేసరికి ఒక్కసారిగా నెటిజన్లు ఖంగు తిన్నారు. అంతేకాదు, ఆమె అలా చేసినందుకు ఆమెపై ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
వాలెంటైన్స్ డే రోజు ప్రియున్ని పరిచయం చేస్తుందనుకుంటే మాళవిక మోహనన్ ఓ కారును ప్రమోట్ చేస్తూ వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు షాకయ్యారు. వాలెంటైన్స్ డేను ఆ కారుతో జరుపుకోవాలని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మేమంతా నీ ప్రియుడి వివరాల కోసం ఎదురు చూస్తే.. నువ్వు మాత్రం.. ఇలా అర్థం పర్థం లేని పోస్టు పెడతావా.. మమ్మల్ని మోసం చేస్తావా.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై మాళవిక మోహనన్ స్పందించాల్సి ఉంది.