ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం కావడంతో కొందరు అందులో పాపులర్ అయ్యేందుకు లేదా కొందరు అందులో డబ్బులు సంపాదించేందుకు చేయకూడని వీడియోలు చేస్తున్నారు. కొందరు కొండ అంచున, జలపాతాల అంచున రీల్స్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కొందరు మాత్రం పబ్లిగ్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు అందరూ చూస్తున్నారు అనే కామన్ సెన్స్ లేకుండా, చేయకూడని పనులు చేస్తూ వాటిని రీల్స్ లా మార్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు ఇదంతా అని అడిగితే మా ఇష్టం అని సమాధానం చెబుతున్నారు. అయితే అక్కడ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హర్యానాలోని పానిపట్‌లో ఓ వ్యక్తి పబ్లిగ్గా బ్రా ధరించి రీల్స్ చేయబోయాడు. అయితే అది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. అలా ఛండాలపు పని ఎందుకు చేస్తున్నావని అడిగితే.. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారని, వారు ఇలాంటి వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, కనుకనే ఇలాంటి రీల్స్ చేస్తున్నానని అతను సమాధానం చెప్పాడు. దీంతో స్థానికులు అవాక్కయ్యారు.
అయితే చుట్టు పక్కల వారందరూ అతన్ని పట్టుకుని నాలుగు దెబ్బలు వేశారు. తరువాత ఇలాంటి గలీజ్ పనులు చేయడానికి సిగ్గు లేదా, పబ్లిగ్గా ఇలాంటివి చేయకూడదు, నువ్వు చేసిన పనికి మహిళలు సిగ్గుతో తలదించుకున్నారు, నువ్వు సారీ చెప్పాల్సిందే.. అంటూ అందరూ అతన్ని నిలదీశారు. దీంతో అతను సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ ఆ సమయంలో తీసిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సైతం అతన్ని తిట్టిపోస్తున్నారు. కొందరు రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదని, ఇలా చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.