హెల్త్ టిప్స్

బ‌రువు పెర‌గ‌కుండా బీర్‌ను ఎలా సేవించాలో తెలుసా..?

చాలా మంది బీర్ ప్రియులు ఉంటారు. హార్డ్ మ‌ద్యం సేవించేవారు కూడా ఉంటారు కానీ ఏ సీజ‌న్ అయినా స‌రే కొంద‌రు బీర్‌ను అదే ప‌నిగా సేవిస్తుంటారు. అయితే బీర్ తాగితే సాధారణంగానే మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు ఎక్కువ‌గా చేరుతాయి. దీంతో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. పొట్ట పెరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు టిప్స్‌ను పాటిస్తే మీరు బీర్ తాగినా కూడా బ‌రువు పెర‌గ‌రు. ఇక ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ తాగేట‌ప్పుడు చాలా మంది ప‌ల్లీలు, శ‌న‌గ‌లు లేదా నాన్ వెజ్ ఆహారాల‌ను తింటుంటారు. అయితే వీటికి బ‌దులుగా గ్రీన్ స‌లాడ్ తినాలి. అంటే కీర‌దోస‌, బీట్‌రూట్‌, క్యారెట్ వంటి వాటిని తినాలి. వీటిని తింటే శ‌రీరంలో చేరే క్యాల‌రీల‌ను త‌గ్గిస్తాయి. బీర్‌ను తాగినప్పుడు చాలా మంది స్నాక్స్ తింటారు. బీర్‌తోపాటు వీటి వ‌ల్ల కూడా బ‌రువు పెరుగుతారు. శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా చేరుతుంది. అయితే ఈ స్నాక్స్‌కు బ‌దులుగా గ్రీన్ స‌లాడ్‌ను తీసుకోవ‌చ్చు. దీంతో బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

how to drink beer without gaining weight

ఇక బీర్ తాగిన‌ప్పుడు వీలైనంత త‌క్కువ‌గా జంక్ ఫుడ్‌ను తినండి. లేదా పూర్తిగా మానేసి పండ్లు వంటివి తినండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. ఖాళీ క‌డుపుతోనూ బీర్‌ను సేవించ‌కూడ‌దు. అలా చేస్తే మ‌రింత బ‌రువు పెరిగే ప్ర‌మాదం ఉంటుంది. ఇలా ప‌లు టిప్స్‌ను పాటిస్తే బీర్ తాగినా కూడా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

Admin

Recent Posts