Masala Papad Chaat : అప్ప‌డాల‌తో మ‌సాలా పాప‌డ్ చాట్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Papad Chaat : అప్ప‌డాల‌ను స‌హ‌జంగానే చాలా మంది అన్నంలో తింటుంటారు. అన్నంతో ప‌ప్పు లేదా సాంబార్‌, ర‌సం వంటివి తిన్న‌ప్పుడు అంచుకు అప్ప‌డాల‌ను పెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అప్ప‌డాలు భ‌లే టేస్టీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు భిన్న‌ర‌కాల రుచుల‌తో అప్ప‌డాలు కూడా ల‌భిస్తున్నాయి. అయితే అప్ప‌డాల‌తో బ‌య‌ట ల‌భించే విధంగా ఎంతో రుచిగా మ‌సాలా పాపడ్ చాట్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యంలో దీన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. పిల్ల‌లు సైతం దీన్ని ఇష్ట‌ప‌డ‌తారు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా పాప‌డ్ చాట్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా పాప‌డ్ చాట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అప్ప‌డాలు – కొన్ని, నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా, ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, ట‌మాటా ముక్క‌లు – అర క‌ప్పు చొప్పున‌, ఉప్పు – త‌గినంత‌, కారం – 1 టీస్పూన్‌, కొత్తిమీర తురుము – కొద్దిగా.

Masala Papad Chaat recipe in telugu how to make them
Masala Papad Chaat

మ‌సాలా పాప‌డ్ చాట్‌ను త‌యారు చేసే విధానం..

కాగుతున్న నూనెలో పెద్ద మ‌సాలా అప్ప‌డాల‌ను వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌ను తీసుకుని దాంట్లో పాప‌డ్ పెట్టి దానిపైన ఉల్లిపాయ‌, ట‌మాటా, ప‌చ్చి మిర్చి ముక్క‌లు, కొత్తిమీర తురుము వేయాలి. త‌గినంత ఉప్పు, కారం కూడా వేసుకుంటే క్ష‌ణాల్లో టేస్టీ టేస్టీ క్రిస్పీ మ‌సాలా పాప‌డ్ చాట్ రెడీ అయిన‌ట్లే. వీటిని వేడి వేడిగా తింటే ఎంతో బాగుంటాయి. ఎప్పుడూ చేసుకునే అప్ప‌డాల‌కు బ‌దులుగా ఇలా మ‌సాలా పాప‌డ్ చాట్‌ను చేసి తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి.

Share
Editor

Recent Posts