Meal Maker Dosa : మీల్‌ మేకర్‌ దోశలను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Meal Maker Dosa : సాధారణంగా మనం వివిధ రకాల దోశలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తింటుంటాం. ఆనియన్‌, మసాలా, చీజ్‌.. ఇలా పలు వెరైటీ దోశలను మనం తయారు చేసి తింటుంటాం. అయితే మీల్‌మేకర్స్‌తోనూ మనం దోశలను తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా రుచిగా ఉంటాయి. వీటిని ఏ చట్నీతో అయినా సరే తినవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. మీల్‌ మీకర్స్‌తో రుచికరంగా దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్‌మేకర్‌ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..

మీల్‌ మేకర్స్‌ – అర కప్పు (గోరు వెచ్చని నీటిలో నానబెట్టుకుని ఉడికించుకుని తురుములా చేసుకోవాలి), బంగాళాదుంపలు – రెండు (ఉడికించి ముద్దలా చేసుకోవాలి), కారం – అర టీస్పూన్‌, అల్లం తురుము – కొద్దిగా, పచ్చి మిర్చి ముక్కలు – ఒక టీస్పూన్‌, నెయ్యి, ఉప్పు – తగినంత, దోశల పిండి – రెండు లేదా మూడు కప్పులు (బియ్యం, మినప పప్పు ముందు రోజు నానబెట్టి మిక్సీ పట్టి పిండిలా సిద్ధం చేసుకోవాలి).

Meal Maker Dosa very health one make like this
Meal Maker Dosa

మీల్‌ మేకర్‌ దోశను తయారు చేసే విధానం..

ముందుగా ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి.. అందులో బంగాళా దుంపల గుజ్జు, మీల్‌ మేకర్‌ తురుము, కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని దోరగా వేయించుకుని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్దిగా నెయ్యి వేసి.. వేడయ్యాక దోశ వేసి దానిపై ఈ మిశ్రమాన్ని పెట్టి రోల్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts