Meal Maker Vada : రుచిగా స్నాక్స్ తినాలంటే.. ఇలా వేడిగా మీల్ మేక‌ర్ వ‌డ‌ల‌ను చేసుకోండి..!

Meal Maker Vada : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో ఎక్కువ‌గా కూర‌ల‌ను, పులుసు, ఫ్రై వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఇవే కాకుండా మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మీల్ మేక‌ర్ ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే మీల్ మేక‌ర్ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – 100 గ్రా., అల్లం – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, మిరియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, బియ్యంపిండి – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Meal Maker Vada recipe in telugu make in this method
Meal Maker Vada

మీల్ మేక‌ర్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత వీటిని చేత్తో పిండుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత జార్ లో అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, మిరియాలు, జీల‌క‌ర్ర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత మీల్ మేక‌ర్, శ‌న‌గ‌ప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిని వ‌డ‌లుగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా వ‌డ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా మీల్ మేక‌ర్ ల‌తో ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts