Karivepaku Vellulli Karam : క‌రివేపాకు వెల్లుల్లి కారం.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

Karivepaku Vellulli Karam : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌ర‌మైన కారం పొడుల‌ల్లో క‌రివేపాకు, వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే వీటితో క‌లిపి చేసే ఈ కారంపొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడిని వేడివేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కారం పొడిని సుల‌భంగా త‌యారు చేసుకోవచ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అం దించే ఈ క‌రివేపాకు వెల్లుల్లి కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రివేపాకు వెల్లుల్లి కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – 2 గుప్పెళ్లు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్,మెంతులు – చిటికెడు, ధ‌నియాలు – 4 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 15, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 15 నుండి 20, చింత‌పండు- చిన్న నిమ్మ‌కాయంత‌.

Karivepaku Vellulli Karam recipe in telugu make in this method
Karivepaku Vellulli Karam

క‌రివేపాకు వెల్లుల్లి కారం త‌యారీ విధానం..

ముందుగా క‌రివేపాకును శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, మెంతులు వేసి చిన్న మంట‌పై వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. క‌రివేపాకును క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.

ఇందులోనే ఉప్పు, చింత‌పండు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అంతా కలిసేలా చేత్తో క‌లుపుకుని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు కారం త‌యార‌వుతుంది. ఈ కారం నెల‌రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఈ విధంగా క‌రివేపాకుతో కారాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts