Methi Paratha : మేథీ ప‌రాటా చాలా మెత్త‌గా పొంగుతూ రావాలంటే.. ఇలా చేయండి..!

Methi Paratha : మేతి ప‌రాటా.. మెంతికూర‌, గోధుమ‌పిండి క‌లిపి చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవిచాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొర‌లు పొర‌లుగా మెత్త‌గా ఉండే ఈ ప‌రోటాను ఒక‌టి ఎక్కువ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ మేతి ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేతి ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన మెంతికూర – అర‌క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 3, అల్లం – ఒక చిన్న ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వాము – అర టీ స్పూన్, పెరుగు – టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్.

Methi Paratha how to make this very soft recipe in telugu
Methi Paratha

మేతి ప‌రాటా త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసుకుని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ ముందుగా పూరీలా వ‌త్తుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి అంతా రాయాలి. త‌రువాత ఈ ప‌రోటాను నాలుగు మ‌డ‌త‌లుగా మ‌డ‌త పెట్టాలి. త‌రువాత మ‌ర‌లా పొడి పిండి చ‌ల్లుకుంటూ ప‌రోటాలా వ‌త్తుకోవాలి.

ఇలా అన్నింటిని వ‌త్తుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత ప‌రోటాను వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. త‌రువాత నూనె వేసి ఎర్ర‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మేతి ప‌రోటా త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట చ‌ట్నీ, పెరుగు వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, లంచ్ బాక్స్ లోకి కూడా ఈ ప‌రోటాలు చ‌క్క‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts