Molakala Salad : మొల‌క‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌ స‌లాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా..!

Molakala Salad : మ‌న‌లో చాలా మంది చ‌క్క‌టి ఆరోగ్యం కోసం మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు విట‌మిన్స్, సూక్ష్మ పోష‌కాలు అన్ని లభిస్తాయి. మొల‌కెత్తిన గింజ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే వీటిని నేరుగా తిన‌లేని వారు వీటితో స‌లాడ్ ను చేసుకుని తీసుకోవ‌చ్చు. కూర‌గాయ‌ల ముక్క‌లు, మొల‌కెత్తిన గింజ‌లు క‌లిపి చేసే ఈ స‌లాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌వారు ఇలా ఎవ‌రైనా ఈ సలాడ్ ను తీసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటేబుల్ మొల‌క‌ల స‌లాడ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటేబుల్ మొల‌క‌ల స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ – 1, ఉడికించిన స్వీట్ కార్న్ – ఒక కప్పు, చిన్న‌గా త‌రిగిన కీరాదోశ ముక్క‌లు – ఒక క‌ప్పు, చిన్నగా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1, మొల‌కెత్తిన పెస‌ర్లు – అర క‌ప్పు, మొల‌కెత్తిన శ‌న‌గ‌లు – పావు క‌ప్పు, మొల‌కెత్తిన ప‌ల్లీలు – పావు క‌ప్పు, చిన్న‌గాత‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – కొద్దిగా, ఆలివ్ నూనె – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, మ‌య‌నీస్ – ఒక టేబుల్ స్పూన్, ఒరిగానో – కొద్దిగా.

Molakala Salad recipe make in this method
Molakala Salad

వెజిటేబుల్ మొల‌క‌ల స‌లాడ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఆలివ్ నూనె, నిమ్మర‌సం, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఒక గిన్నెలో కూర‌గాయ‌ల ముక్క‌ల‌తో పాటు, మొల‌కెత్తిన గింజ‌ల‌ను కూడా తీసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. తరువాత ఆలివ్ నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌య‌నీస్, ఒరిగానో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ మొల‌క‌ల స‌లాడ్ త‌యార‌వుతుంది. ఈ స‌లాడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts