Home Remedies For Vitamin B12 : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. కండరాలను ధృడంగా ఉంచడంలో, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, ఎర్ర రక్తకణాల తయారీకి ఇలా అనేక రకాలుగా విటమిన్ బి12 మనకు అవసరమవుతుంది. కానీ మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపించడం వల్ల కండరాలు బలహీనంగా తయారవుతాయి. సరిగ్గా నడవలేకపోతారు. అలసట, నీరసం ఎక్కువగా వస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. చర్మం ముడతలు పడుతుంది. అకాల వృద్దాప్య చాయలు మన దరి చేరుతాయి. ఈ విధంగా ఈ లక్షణాలను బట్టి మనం విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నామని తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన మందులు వాడడం అవసరం.
మందులు వాడుతూనే విటమిన్ బి12 ఉండే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి12 ఎక్కువగా జంతు సంబంధిత ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ఏయే ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపంతగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల చాలా సులభంగా విటమిన్ బి12 లోపం నుండి బయటపడవచ్చు. తృణ ధాన్యాల్లో కూడా విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం రాకుండా ఉంటుంది.
ఈస్ట్ లో కూడా విటమిన్ బి12 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈస్ట్ లో విటమిన్ బి12 తో పాటు శరీరానికి అవసరమయ్యే ఇతర విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. అలాగే సోయా పాలు, బియ్యం నుండి తీసిన పాలల్లో కూడా విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. చేపలల్లో కూడా విటమిన్ బి12 ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ బి12 తో పాటు ప్రోటీన్, ఒమెగా 3 ప్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి. విటమిన్ బి12 లోపంతో బాధపడే వారు చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజూ రెండు గుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 సమస్య రాకుండా ఉంటుంది. విటమిన్ బి12 లోపంతో బాధపడే వారు చికెన్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి పలితం ఉంటుంది.
చికెన్ లో కూడా విటమిన్ బి12, ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే చికెన్ లివర్ లో కూడా విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 తో పాటు ప్రోటీన్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి12తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.