Saffron For Baby : కుంకుమ పువ్వును తీసుకుంటే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారా.. ఏ నెల నుంచి తీసుకోవాలి..?

Saffron For Baby : నేటి కాలంలో చాలా మంది స్త్రీలు సిజేరియ‌న్ ల ద్వారానే బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిస్తున్నారు. సాధార‌ణ ప్ర‌స‌వం ద్వారా జ‌రిగే జ‌ననాలు ఈ మ‌ధ్య కాలంలో చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఇత‌ర ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సిజేరియ‌న్ లు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా సిజేరియ‌న్ కు బ‌దులుగా సుఖ ప్ర‌స‌వం జ‌రగాలంటే గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. సాధారణంగా పాల‌ల్లో కుంకుమ‌పువ్వును క‌లిపి తీసుకుంటే పుట్టే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారని చెబుతూ ఉంటారు.

కానీ కుంకుమ పువ్వుకు పుట్టే బిడ్డ రంగుకు ఏ మాత్రం సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. కుంకుమ‌పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల సుఖ ప్ర‌స‌వం అయ్యే అవ‌కాశం మాత్ర‌మే ఉంటుంద‌ని బిడ్డ రంగులో ఏ మాత్రం తేడా ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును వాడే విష‌యంలో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని వారు చెబుతున్నారు. గ‌ర్భిణీ స్త్రీలు మొద‌టి 4 నెల‌లు కుంకుమ‌పువ్వుకు దూరంగా ఉండ‌డం మంచిది. కుంకుమ‌పువ్వుకు క‌ద‌లిక‌ల‌ను పెంచే శ‌క్తి ఉంది. క‌నుక 4 నెల‌ల లోపు కుంకుమ‌పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశం ఉంది. నాలుగు నెల‌ల త‌ర్వాత అది కూడా అర గ్రాము నుండి గ్రాము మోతాదులో రోజుకు ఒక్కసారి మాత్ర‌మే పాల‌ల్లో క‌లిపి తీసుకోవాలి.

Saffron For Baby important facts to knowSaffron For Baby important facts to know
Saffron For Baby

కుంకుమ‌పువ్వును ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల నెల‌లు నిండిన‌ప్ప‌టికి గర్భ‌స్రావం అయ్యే అవకాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య కండ‌రాలు చురుకుగా ఉండ‌డంతో పాటు గ‌ర్భాశ‌యంలో క‌ద‌లిక‌లు చ‌క్క‌గా ఉంటాయి. గ‌ర్భాశ‌య కండ‌రాలు చురుకుగా ఉండ‌డం వ‌ల్ల ప్ర‌స‌వం తేలిక‌గా ఉండ‌డంతో పాటుగా సిజేరియ‌న్ చేయాల్సిన ప‌రిస్థితులు కూడా చాలా త‌క్కువ‌గా ఏర్ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో నెల‌లు పెరిగే కొద్ది బీపీ పెరుగుతూ ఉంటుంది. కుంకుమపువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల అధికంగా ఉండే బీపీ కొద్దిగా త‌గ్గే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

అలాగే కుంకుమ‌పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ స్త్రీలల్లో వ‌చ్చే మూడ్ స్వింగ్స్ కూడా అదపులో ఉంటాయి. అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో డిఫ్రెష‌న్ కూడా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంది. త‌రుచూ డిఫ్రెష‌న్ కు గుర‌య్యే వారు కుంకుమపువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కుంకుమపువ్వును వాడ‌డంతో పాటు రోజూ సాయంత్ర భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల సుఖ ప్ర‌స‌వం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌స‌వ స‌మ‌యంలో నొప్పులు త‌క్కువగా వ‌స్తాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. ఈ విధంగా కుంకుమ‌పువ్వు గ‌ర్భిణీ స్త్రీల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts