lifestyle

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ.. ఈయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌. ప్ర‌పంచంలోని కుబేరుల్లో ఒక‌డు. రిల‌య‌న్స్ చ‌మురు మొద‌లుకొని, జియో, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్రెష్.. ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారాల‌ను కొన‌సాగిస్తూ దూసుకెళ్తున్నారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి వ‌చ్చిన ఆస్తిని ఈయ‌న ఎన్నో రెట్లు పెంచుకోగా.. ఈయ‌న త‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాళా తీశాడు. ఇక ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. ఆమె రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ సేవా కార్య‌క్ర‌మాల‌తోపాటు ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్ బాధ్య‌త‌ల‌ను కూడా చూస్తుంటుంది. అయితే ముకేష్ అంబానీ అత్యంత సంప‌న్నుడు క‌నుక ఆయ‌న ద‌గ్గ‌ర స‌హ‌జంగానే ఏదైనా స‌రే అత్యంత విలువైన వ‌స్తువులు ఉంటాయి. అలాంటి వాటిల్లో కార్లు కూడా ఒక‌టి.

ముకేష్ అంబానీ ద‌గ్గ‌ర అత్యంత విలువైన కార్లు 7 వ‌ర‌కు ఉన్నాయి. వాటిని ఆయ‌న త‌ర‌చూ ఉప‌యోగిస్తుంటారు. ముకేష్ అంబానీకి కార్లంటే ఇష్టం. అందువ‌ల్ల ఆయ‌న మార్కెట్‌లోకి వ‌చ్చే విలాస‌వంత‌మైన కార్ల‌ను కొంటుంటారు. ముంబైలోని ఆయ‌న భ‌వంతిలో కార్ పార్కింగ్ కోసం చాలానే స్థ‌లం ఉంది. అందువ‌ల్ల ఎన్ని కార్లు ఉన్నా ఆయ‌న‌కు పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు. ఇక ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mukesh Ambani Cars do you know about them

ముకేష్ అంబానీ ద‌గ్గ‌ర మెర్సిడెస్ కంపెనీకి చెందిన ఓ విలాస‌వంత‌మైన కారు ఉంది. దాని ఖ‌రీదు సుమారుగా రూ.10 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్ గార్డ్ 600 అనే పేరున్న ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్‌ను క‌లిగి ఉంటుంది. అంబానీలు ఎక్కువ‌గా ఈ కంపెనీ కార్ల‌నే ఉప‌యోగిస్తుంటారు. ఇక దీని త‌రువాత రూ.6.95 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ క‌ల్లిన‌న్ కారు కూడా ఉంది. అలాగే రూ.5.50 కోట్ల విలువైన ఫెరారీ 812 సూప‌ర్ ఫాస్ట్‌, రూ.3.85 కోట్ల విలువైన బెంట్లీ బెంట‌య‌గ‌, రూ.2.62 కోట్ల విలువైన బీఎండ‌బ్ల్యూ ఐ8, రూ.2.14 కోట్ల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జి63 కార్లు ఉన్నాయి. వీటితోపాటు రూ.1.50 కోట్ల విలువైన టెస్లా మోడ‌ల్ ఎస్100 డి కారు కూడా ఉంది. ఇవ‌న్నీ ముకేష్ అంబానీ వాడే కార్లు. వీటి మొత్తం విలువ సుమారుగా రూ.33 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కార్ల క‌లెక్ష‌న్ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది.

Admin

Recent Posts