Garlic : ఆయుర్వేద ప‌రంగా వెల్లుల్లి మ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

Garlic : మ‌నం వంట‌ల్లో ఎంతో కాలంగా వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ ఉన్నాం. వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి ఉప‌యోగించి మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. దీనిని వంటల్లో వాడ‌డం వ‌ల్ల లేదా నేరుగా న‌మిలి తిన్నా కూడా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే వెల్లుల్లికి ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే గుణం కూడా ఉంది. వెల్లుల్లిని విరివిరిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా వెల్లుల్లి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి.

ayurvedic uses of Garlic know how to use it
Garlic

వెల్లుల్లిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వెల్లుల్లి రెబ్బ‌లకు ఉప్పును క‌లిపి క‌చ్చా ప‌చ్చాగా దంచాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని దెబ్బ‌ల వ‌ల్ల క‌లిగిన వాపుల‌పై ఉంచి క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయడం వ‌ల్ల దెబ్బ‌ల వ‌ల్ల క‌లిగిన వాపులు త‌గ్గుతాయి. అలాగే నువ్వుల నూనె లేదా ఆవ నూనెను 4 టీ స్పూన్ల మోతాదులో తీసుకుని తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బ‌లను దంచి వేసి నూనెను వేడి చేయాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత దీనిని ఒకటి లేదా రెండు చుక్క‌ల మోతాదులో చెవిలో వేయ‌డం వ‌ల్ల చెవి పోటు త‌గ్గుతుంది. అదే విధంగా వెల్లుల్లిని, సున్నాన్ని, ప‌సుపును క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని ఎముక‌లు బెణికిన చోట ఉంచి క‌ట్టు క‌ట్టాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల బెణ‌క‌డం వ‌ల్ల క‌లిగే వాపు, నొప్పి త‌గ్గుతాయి. అలాగే వెల్లుల్లి ర‌సాన్ని 2 టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ పండ్ల ర‌సాన్ని తీసుకోవాలి. ఇలా రోజుకు 5 సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల టైఫాయిడ్ జ్వ‌రం త‌గ్గు ముఖం ప‌డుతుంది. అలాగే వెల్లుల్లిని రోజూ ఉద‌యం ప‌ర‌గడుపున న‌మిలి తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వీటిని నేరుగా తిన‌లేని వారు తేనెతో క‌లిపి తినవ‌చ్చు లేదా వాటి నుండి ర‌సాన్ని తీసుకుని తాగ‌వ‌చ్చు. ఈ విధంగా మ‌న వంట‌గ‌దిలో ఉండే వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts