Nalla Venu : సినిమా ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో నటుడు వేణు ఒకరు. ఈయన అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డానని.. చెప్పులరిగేలా తిరిగానని వేణు తెలిపాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డానని.. తరువాత తనకు ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చాయని తెలిపాడు. ఈ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చేవారు అవకాశాలు రావాలంటే.. అంత ఈజీ ఏమీ కాదని అన్నాడు. ఇక టాలెంట్ ఉన్నప్పటికీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే.. లక్ కూడా కావాల్సిందేనని అన్నాడు. ఇప్పటికీ ఎంతో మంది ఒకే ఒక్క చాన్స్ కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని అన్నాడు.
కాగా కమెడియన్ వేణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితానికి చెందిన పలు విషయాలను వెల్లడించాడు. తాను మార్షల్ ఆర్ట్స్ పూర్తి చేశానని, రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచానని తెలిపాడు. అయితే నటున్ని అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని, అన్నదానాలు చేసిన చోట భోజనం తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద నిద్రించేవాడనని తెలిపాడు. అయితే ఎలాగైనా సరే తెరపై కనిపించాలని తనకు చెప్పిన అన్ని పనులు చేశానని, చివరకు టచప్ బాయ్‌గా, మేకప్ అసిస్టెంట్‌గా, సెట్ బాయ్‌గా, కూలీగా, పేపర్ బాయ్‌గా కూడా పని చేశానని వేణు తెలిపాడు.
ఇక నటుడిని అవ్వాలన్న కలతో ఆఖరికి అంట్లు తోమానని, బాత్రూమ్‌లు కూడా కడిగానని తెలిపాడు. ఇండస్ట్రీలోకి రావడం కోసం కొందరితో పరిచయాలు పెంచుకున్నానని.. వాళ్లను బతిమిలాడి వారి రూమ్‌లలో ఉండేవాడినని తెలిపాడు. అయితే తనను పనిచేసే పనివాడిగా ఉంచుకున్నారని అన్నాడు. ఆ సమయంలోనే ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపాడు.
ఇక వేణు ఎంతో కష్టపడి పైకి వచ్చినట్లు తెలిపాడు. సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటిస్తూ మరోవైపు అప్పట్లో జబర్దస్త్ షో లో చేశాడు. ప్రస్తుతం సినిమాలతోపాటు పలు టీవీ షోలు, ఈవెంట్స్‌లో కూడా పాల్గొంటున్నాడు.