food

Nalleru Podi : న‌ల్లేరు పొడి ఇలా చేయాలి.. మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు సైతం లేచి ప‌రుగెడ‌తారు..!

Nalleru Podi : మ‌నకు ప్ర‌కృతి ప్రసాదించిన దివ్యౌష‌ధ మొక్క‌ల‌ల్లో నల్లేరు మొక్క కూడా ఒక‌టి. న‌ల్లేరు మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చాలా మంది అలంక‌ర‌ణ‌కు ఈ మొక్క‌ను ఇళ్ల‌ల్లో కూడా పెంచుకుంటున్నారు. న‌ల్లేరు మొక్క ఎముక‌లకు ఎంతో మేలు చేస్తుంది. న‌ల్లేరు మొక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకుతాయి. ఎముక‌లు గుళ్ల‌బార‌డం, ఆస్ట్రియోపోరోసిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థ్ర‌రైటిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు న‌ల్లేరును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అంతేకాకుండా అజీర్తి, ఆక‌లిలేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా న‌ల్లేరు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. చాలా మంది ఈ న‌ల్లేరుతో ప‌చ్చ‌డిని, కారం పొడిని త‌యారు చేస్తూ ఉంటారు. న‌ల్లేరుతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ న‌ల్లేరు కారం పొడిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ న‌ల్లేరుతో కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ల్లేరు పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లేత న‌ల్లేరు కాడ‌లు- 200గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – పావు క‌ప్పు, మిన‌ప‌ప్పు – పావు క‌ప్పు, మెంతులు – 10, ఎండుమిర్చి – 15 నుండి 20, ధ‌నియాలు – పావు క‌ప్పు, నువ్వులు – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – గుప్పెడు, చింత‌పండు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెమ్మ‌లు – 6.

Nalleru Podi wonderful health benefits

న‌ల్లేరు పొడి త‌యారీ విధానం..

ముందుగా న‌ల్లేరు కాడ‌ల‌ను పీచు లేకుండా శుభ్రం చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు,మెంతులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత నువ్వులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. దాదాపు ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. చివ‌ర‌గా చింత‌పండు వేసి క‌లిపి వీట‌న్నింటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసివేడి చేయాలి. త‌రువాత న‌ల్లేరు కాడ‌లు వేసి వేయించాలి. ఈ న‌ల్లేరు కాడ‌ల‌ను వాటిలోని నీరంతా పోయి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు బాగా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు, ఉప్పువేసి మరీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో వెల్లుల్లి రెమ్మ‌లు, వేయించిన న‌ల్లేరు కాడ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. దీనిని ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కారంలో వేసి చేత్తో బాగా క‌లుపుకోవాలి. దీనిని కొద్దిగా పొడిగా అయ్యే వ‌ర‌కు ఆర‌బెట్టి ఆ త‌రువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల న‌ల్లేరు కారం పొడి త‌యార‌వుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఒక నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నం తినేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌గా ఈ కారం పొడి, నెయ్యి వేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts