Nandamuri Balakrishna : బాల‌కృష్ణ 107వ సినిమా ఫ‌స్ట్ లుక్‌.. అదిరిపోయింది..!

Nandamuri Balakrishna : ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో లీకుల బెడ‌ద ఎక్కువైంది. మొన్నీ మ‌ధ్యే స‌ర్కారు వారి పాట‌లోంచి క‌ళావ‌తి సాంగ్‌ను లీక్ చేశారు. దీంతో మేక‌ర్స్ అనుకున్న తేదీకి ఒక్క రోజు ముందే ఆ పాట‌ను విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఇక నంద‌మూరి బాలకృష్ణ 107వ సినిమాలోంచి ఆయన ఫ‌స్ట్ లుక్‌ను లీక్ చేశారు. దీంతో ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌క త‌ప్ప‌లేదు.

Nandamuri Balakrishna 107 film first look
Nandamuri Balakrishna

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ త‌న 107వ సినిమా చేస్తున్నారు. అఖండ త‌రువాత ఆయ‌న నేరుగా అఖండ 2 లో న‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇంకో సినిమా ప్రారంభించారు. ఇక ఆయ‌న తాజా సినిమాలోంచి ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేయ‌గా.. అది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇందులో బాల‌కృష్ణ చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపించారు. స్టైలిష్‌గా కూడా ఉన్నారు. చూస్తుంటే ఆయ‌న గ‌నుల్లో న‌డుస్తున్న‌ట్లు ఉంది. దీంతో ఈ సినిమా ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది.

ఇక బాల‌కృష్ణ 107వ సినిమాలో ఆయ‌న లుక్‌కు చెందిన పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ మూవీ షూటింగ్‌లో కొంత భాగాన్ని ఇటీవ‌లే సిరిసిల్ల‌లో పూర్తి చేశారు. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Admin

Recent Posts