IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత సులభం కానుంది. అందుకు గాను ప్రత్యేకంగా ఓ యాప్‌ను ఐఆర్‌సీటీసీ లాంచ్ చేసింది. కన్‌ఫామ్ టిక్కెట్ (Confirm Tkt) పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా ఇకపై రైలు ప్రయాణికులు సులభంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. ఈ యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అందుకు గాను పలు ఆప్షన్‌లను ఇందులో ఇచ్చారు.
వివిధ రకాల ట్రైన్లలో అందుబాటులో ఉన్న తత్కాల్ టిక్కెట్లతోపాటు ఒక మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఉన్న తత్కాల్ టిక్కెట్ల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికులు తాము బుక్ చేసిన టిక్కెట్‌ను ఉచితంగా క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న యూజర్లు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దీంతో టిక్కెట్లను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇక పేమెంట్ చేశాక టిక్కెట్ అందుబాటులో ఉంటే అప్పుడు అది కన్‌ఫామ్ కూడా అవుతుంది. అయితే ఈ యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తే అందుకు అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.