Natural Mosquito Repellent : కాలంతో సంబంధం లేకుండా మనల్ని వేధించే వాటిల్లో దోమలు ఒకటి. దోమల వల్ల మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వీటి వల్ల మనం ప్రాణాంతక విష జర్వాల బారిన పడాల్సి వస్తుంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఇవి మనల్ని వేధిస్తూనే ఉంటాయి. దోమల బారి నుండి బయటపడడానికి రిఫిల్స్, బ్యాట్స్, కాయిల్స్, క్రీములు.. ఇలా మార్కెట్ లో దొరికే అన్ని రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండకపోగా వీటిలో వాడే రసాయనాల కారణంగా దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. కొన్ని రకాల సహజ చిట్కాలను వాడి ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా దోమలను మనం తరిమి వేయవచ్చు. దోమలను తరిమి వేసే సహజ సిద్ద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను తరిమే చిట్కాలను తెలుసుకోవడానికి ముందుగా దోమల్లో రకాలు వాటి వల్ల కలిగే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈడిస్ దోమల కారణంగా చికెన్ గున్యా, డెంగ్యూ, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, ఎల్లో ఫీవర్, బోదకాలు, జికా వంటి వ్యాధులు వస్తాయి.
అలాగే ఎనాఫిలిస్ దోమల కారణంగా మలేరియా, బోదకాలు వంటి వ్యాధులు వస్తాయి. అలాగే క్యూలెక్స్ దోమల కారణంగా మెదడు వాపు వంటి మరణాంతక వ్యాధి వస్తుంది. దోమలను పారదోలే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లల్లి వాసన దోమలను దూరం చేస్తుంది. మినరల్ ఆయిల్ లో వెల్లుల్లిని, లవంగాలను దంచి వేయాలి. ఈ నూనెను ఒక రోజంతా అలాగే ఉంచాలి. తరువాత ఈ నూనెను వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే నూనెలో 2 కప్పుల నీళ్లు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ నూనెను స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు పారిపోతాయి. అలాగే దోమలను తరిమి వేయడంలో తులసి ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటి పరిసరాల్లో తులసి చెట్టును పెంచుకోవడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. తులసి దోమల లార్వాకు విరుగుడుగా పని చేస్తుంది. తులసి ఆకుల నుండి తీసిన నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమలు పారిపోతాయి. ఈ నూనెను పిల్లలకు కూడా రాయవచ్చు. దీంతో వారి దరిదాపుల్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
అదే విధంగా దోమలను పారదోలడంలో పుదీనా మనకు దోహదపడుతుంది. దోమలకు పుదీనా వాసన నచ్చదు. పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని చర్మం పై రాసుకోవడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి. అలాగే నిమ్మగడ్డిని ఉపయోగించడం వల్ల కూడా మనం దోమలను పారదోలవచ్చు. నిమ్మగడ్డి నుండి తీసిన నూనెను, ఆలివ్ నూనెను కలిపి దోమలు ఎక్కువగా ఉండే స్ప్రే చేయాలి. అలాగే ఈనూనెను చర్మానికి రాసుకోవడం వల్ల కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. అలాగే వేపనూనెకు సమానంగా కొబ్బరి నూనెను కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి. అలాగే కొందరిని మాత్రమే దోమలు ఎక్కువగా కుట్టడాన్ని మనలో చాలా మంది గమనించే ఉంటారు. దోమలు ఇష్టపడే సువాసనలు మన జన్యువులపై ఆధారపడి ఉంటాయి.
దోమ కాటుకు 85 శాతం మన జన్యువులే కారణమని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఎక్కువ జీవక్రియల రేటు కలిగి ఉండే వారిని అలాగే కార్బన్ డై యాక్సైడ్ ను ఎక్కువగా గ్రహిస్తున్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒ గ్రూప్ రక్తం కలిగిన వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. అలాగే వ్యాయామం చేసిన తరువాత, పని చేసిన తరువాత వచ్చే చెమట వాసనను కూడా దోమలు ఆకర్షిస్తాయి. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాలను పాటించడం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.