Nayanthara Diet : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. తన నటనతో సినిమా రంగాన్ని డామినేట్ చేయడంతో పాటు తను ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా. నయనతార పాటించే కొన్నిఫిట్ నెస్ సూత్రాలను, ఆరోగ్య సూత్రాలను మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార యోగాకు, ధ్యానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంది. దీంతో ఆమె ప్రశాంతంగా ఉండడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే నయనతార రోజూ తగినంత విశ్రాంతిని తీసుకుంటుంది. నిద్ర విషయంలో రాజీ పడదు.
రోజూ 8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయిస్తుంది. ఆమె తన రోజుని వ్యాయామంతో ప్రారంభిస్తుంది. అలాగే రోజూ కఠిన వ్యాయామాలు చేస్తుంది. పైలేట్స్ చేయడం, తగిన బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలను చేయడానికి ప్రధాన్యతను ఇస్తుంది. అలాగే నయనతార కొబ్బరి నీళ్లకు పెద్ద అభిమాని. రోజూ 5 సీసాలు తాగడానికి ఇష్టపడుతుంది. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటుంది. దీంతో చర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ లేడీ సూపర్ స్టార్ నో జంక్ ఫుడ్ పాలసీని కలిగి ఉంది. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కు కూడా దూరంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన దక్షిణ భారతీయ వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇక నయనతారకు వంట చేయడం చాలా ఇష్టం.
ఆమె రోజువారి అల్పాహారంలో భాగంగా గుడ్లు, తృణ ధాన్యాలను, తాజా పండ్ల రసాన్ని తీసుకుంటారు. ఆమె ఉదయం అల్పాహారాన్ని సంపూర్ణంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే దక్షిణ భారత వంటకాలను నయనతార పెద్ద అభిమాని. మధ్యాహ్నం పూట గోధుమ రొట్టె, కూరగాయలను తీసుకుంటారు. అలాగే ప్రోటీన్ కోసం చేపలను, కాల్చిన చికెన్ ను తీసుకుంటారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటుంది. చిన్న గిన్నె పెరుగన్నం లేదా కూరగాయల పప్పుతో చపాతీ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది.