Niharika Konidela : మెగా డాటర్ గా పేరుగాంచిన నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె నటిగా ఒకటి రెండు సినిమాల్లో చేసింది. కానీ అవి హిట్ కాలేదు. దీంతో కొంత కాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తరువాత షార్ట్ ఫిలిమ్స్ వగైరా చేసింది. అవి కూడా సెట్ కాలేదు. ఈ క్రమంలో ఈమె చాలా కాలం పాటు అలాగే ఉంది. ఆ తరువాత వివాహం చేసుకుంది.
గత 2 సంవత్సరాల నుంచి కరోనా సమయం నడుస్తోంది. ఈ క్రమంలోనే కరోనా కాలంలో నిహారిక వివాహం అయింది. చైతన్య జొన్నలగడ్డ అనే యువకున్ని వివాహం చేసుకుంది. తరువాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఈ మధ్యే మళ్లీ ఇండస్ట్రీకి వచ్చింది. అయితే నటిగా కాదు.. నిర్మాతగా. ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్, సినిమాలకు నిర్మాతగా చేయాలని చూస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారికకు లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. అందులో భాగంగానే ఆమె తరచూ తన ఫొటోలను, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆమెను నెటిజన్లు తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. కరోనా కాలంలో ఆమె పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ట్రోలింగ్ ఎక్కువైంది. జనాలు ఓ వైపు కరోనాతో చనిపోతుంటే.. నువ్వు పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి పోస్టులు పెడుతున్నావా.. అంటూ ఆమెపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ విమర్శలు చేశారు.
ఆ ట్రోల్స్, విమర్శలను భరించలేకే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కనిపించడం లేదు. మరి ముందు ముందు మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను ఓపెన్ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.