Cabbage : క్యాబేజీతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇలా కరిగించండి..!

Cabbage : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా చాలా మంది ఈ సమస్యలతోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు, పొట్ట దగ్గరి కొవ్వు కరిగేందుకు ప్రతి ఒక్కరూ అనేక విధానాలను పాటిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉండే క్యాబేజీతోనూ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే..

here it is how you can reduce weight with Cabbage
Cabbage

క్యాబేజీని సూప్‌ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంట్లో ఉండే సమ్మేళనాలు మన శరీరంలోని కొవ్వును కరిగించేస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. క్యాబేజీతో సూప్‌ తయారు చేసుకుని రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ లో లేదా మధ్యాహ్నం లంచ్‌ సమయంలో తాగాలి. దీంతో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.

క్యాబేజీ సూప్‌ను ఇలా తయారు చేసుకోండి..

ఒక క్యాబేజీని తీసుకుని సన్నగా తరగాలి. రెండు క్యారెట్‌ లను తీసుకుని సన్నగా ముక్కలుగా కట్‌ చేయాలి. రెండు ఉల్లిపాయలను కూడా అలాగే కట్‌ చేయాలి. అనంతరం అర టీస్పూన్‌ కార్న్‌ ఫ్లోర్‌, ఒక టీస్పూన్‌ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్‌ వెన్న తీసుకోవాలి.

ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలు అన్నింటినీ కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకు కూరగాయలను ఉడకబెట్టాలి. అనంతరం ఒక పాన్‌లో వెన్న వేసి అందులో ముందుగా ఉడకబెట్టుకున్న కూరగాయలను వేయాలి. అందులో కుక్కర్‌లో ఉండే నీరు కూడా పోయాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. సూప్‌ చిక్కగా రావడం కోసం కొద్దిగా కార్న్‌ ఫ్లోర్‌ను వేసి ఉండలుగా కాకుండా కలపాలి. దీంతో క్యాబేజీ సూప్‌ రెడీ అవుతుంది.

ఇలా తయారు చేసుకున్న క్యాబేజీ సూప్‌ను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు కూడా తగ్గుతాయి.

Admin

Recent Posts