Aishwarya Rajinikanth : తమిళ స్టార్ నటుడు ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె.. ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే కోవిడ్ బారిన పడి హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్న విషయం విదితమే. కాగా ఆమె కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కానీ తాజాగా మరోమారు హాస్పిటల్‌లో చేరారు. దీంతో ఆమెకు ఏమైంది ? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాల వల్లే ఆమె హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఐశ్వర్య రజనీకాంత్ కరోనా బారిన పడడంతో ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోని ఓ హాస్పిట్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆమెకు అధిక జ్వరం, తల తిరగడం (వర్టిగో) లక్షణాలు కనిపించడంతో వెంటనే చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ముసాఫిర్ అనే మ్యూజిక్ వీడియో షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురి కావడంతో మరోమారు హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.
కాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు ఈ ఏడాది జనవరి 17వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వీరి నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. రజనీకాంత్ వారికి విడాకులు వద్దని, కలసి ఉండాలని నచ్చజెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఇద్దరూ విడాకుల వైపే మొగ్గు చూపారు. ఇక ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఓ పార్టీలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ఎదురు పడ్డారు. కానీ ఒకరినొకరు పలకరించుకోవడం కాదు కదా.. కనీసం ఒకరినొకరు చూడలేదని తెలిసింది. ఆ తరువాత ఆమె చెన్నైకి వచ్చారు. ఈ క్రమంలోనే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఆమె హాస్పిటల్‌లో చేరారు.