Oppo : ఒప్పో నుంచి ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌..!

Oppo : మొబైల్స్ త‌యారీదారు ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మ‌రో రెండు ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఎ76, ఎ96 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను ఒప్పో లాంచ్ చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

Oppo  A76 and OPPO A96 smart phones launched
Oppo

ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్‌లో.. 6.56 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో ఎ96 స్మార్ట్ ఫోన్‌లో.. 6.59 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 50, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో ఎ76 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.17,499 ఉండ‌గా.. ఒప్పో ఎ96 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.19,999గా ఉంది. వీటిని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts