Palakura Pulusu : పాల‌కూర‌ను ఎప్పుడైనా ఇలా వండారా.. ఒక్క‌సారి చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..

Palakura Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాల‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు పాల‌కూర‌తో మ‌నం పులుసు కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా ఈ కూర‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో పులుసు కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర పులుసు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పాల‌కూర – 5 క‌ట్ట‌లు, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చింత‌పండు – ఒక రెమ్మ‌, నీళ్లు – ఒక గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Palakura Pulusu recipe in telugu very tasty make in this method
Palakura Pulusu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – , క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

పాల‌కూర పులుసు కూర త‌యారీ విధానం..

ముందుగా పాల‌కూర‌ను శుభ్రంగా క‌డిగి ఒక కుక్క‌ర్ లోకి తీసుకోవాలి. త‌రువాత అందులో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, చింత‌పండు, నీళ్లు పోసి మూత‌పెట్టాలి. ఈ పాల‌కూర‌ను మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి అందులో ఉప్పు, కారం, ప‌సుపు వేసి మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ఉడికించుకున్న పాల‌కూర‌ను వేసి క‌లిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర పులుసు కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల‌కూర‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పులుసు కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts