Paneer Kurma : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ కుర్మాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Paneer Kurma : మ‌న‌కు ధాబాల‌ల్లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ కుర్మా కూడా ఒక‌టి. చ‌పాతీ, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం రుచిగా ఉండ‌డంతో పాటు ప‌నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ ప‌నీర్ కుర్మాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డంచాలా సుల‌భం. ఎవ‌రైనా ఈ క‌ర్రీని చాలా తేలిక‌గా రెస్టారెంట్ స్టైల్ లో త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ ప‌నీర్ కుర్మాను ఇంట్లోనే ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. అన్న‌వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడవుగా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, జీడిప‌ప్పు – 10, తియ్య‌టి పెరుగు – పావు క‌ప్పు, బిర్యానీ ఆకు – 1, న‌ల్ల‌యాల‌క్కాయ – 1, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, జాప‌త్రి – కొద్దిగా, మిరియాలు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక‌ క‌ప్పు, ప‌నీర్ – 250 గ్రా., త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌సూరిమెంతి -ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్.

Paneer Kurma recipe in telugu make in this method
Paneer Kurma

ప‌నీర్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో వేయించిన ఉల్లిపాచ ముక్క‌లు, జీడిప‌ప్పు, పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌సాలా దినుసులు, మిరియాలు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వ‌రకు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.త‌రువాత ఉప్పు, కారం , ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.త‌రువాత ప‌నీర్ ముక్క‌లు, క‌సూరిమెంతి, గ‌రం మ‌సాలా, క్రీమ్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ కుర్మా తయారవుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పుల్క‌, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts