Pawan Kalyan : భీమ్లా నాయక్ సినిమాతో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తన నటనతో, డైలాగ్స్‌తో ఈ సినిమాకు విజయాన్ని అందించారు. ఇక పవన్ కళ్యాణ్ వినోదయం సితం అనే తమిళ సినిమా రిమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమాను త్రివిక్రమ్, జీ స్టూడియోస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ కలిసి నిర్మించనున్నారు. ఒక్కొక్కరికి లాభాల్లో 25 శాతం వాటా రానుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో 25 రోజులు పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రూ.60 కోట్ల పారితోషకంతోపాటు లాభాల్లో వాటాను కూడా తీసుకోనున్నారు. సాయి ధరమ్ తేజ్ రూ.8 కోట్ల పారితోషికాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.
గత సంవత్సరం యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని తెరక్కెకించడానికి పవన్ కళ్యాణ్ , ధరమ్ తేజ్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. వినోదయం సితం సినిమాను గత సంవత్సరం నేరుగా జీ5 ఓటీటీలో విడుదల చేశారు. ఈ చిత్రం విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిత్రీకరించడానికి ఈ సినిమాలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక దీంతోపాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.