Cholesterol Levels : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా.. మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే మన శరీరం ఎప్పటికప్పుడు వాటిని బయటకు పంపేస్తుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అధికంగా ఆహారం తీసుకుంటే మాత్రం అదంతా కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది ఒక పట్టాన కరగదు. దీనికి తోడు శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. కనుక శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగేందుకు అధికంగా భోజనం చేయడం ఒక్కటే కాదు.. ఇంకా అనేక కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏవైనా సరే.. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చేరితే దాన్ని తగ్గించుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన వాటిని రోజూ తాగాల్సి ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. మరి ఆ డ్రింక్స్ ఏమిటంటే..
1. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించేస్తాయి. కనుక రోజూ ఒక కప్పు మోతాదులో టమాటా జ్యూస్ లేదా సూప్‌ను తీసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
2. గ్రీన్ టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం కడిగినట్లు బయటకు పోతుంది. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీని తాగితే ఫలితం ఉంటుంది.
3. దానిమ్మ పండును రోజుకు ఒకటి తింటున్నా.. లేదా దాని జ్యూస్‌ను రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగుతున్నా.. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.
4. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో ఉసిరికాయ రసం బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.