Pesala Mixture : స్వీట్ షాపుల్లో ల‌భించే పెస‌ల మిక్చ‌ర్‌.. ఇంట్లోనూ ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Pesala Mixture : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పెస‌ర్ల మిక్చ‌ర్ కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల మిక్చ‌ర్ ను స్వీట్ షాప్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర్ల మిక్చ‌ర్ త‌య‌రీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన పెస‌ర్లు – రెండు కప్పులు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ప‌ల్లీలు – 3 టీ స్పూన్స్, జీడిప‌ప్పు – 2 టీ స్పూన్స్, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్.

Pesala Mixture recipe in telugu make in this method
Pesala Mixture

పెసర్ల మిక్చ‌ర్ త‌యారీ విధానం..

ముందుగా నాన‌బెట్టిన పెస‌ర్ల‌ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా వ‌డ‌క‌ట్టుకోవాలి. త‌రువాత వీటిని త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, బియ్యంపిండి, ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని జంతిక‌ల గొట్టంలో ఉంచి కార పూస‌ను నూనెలో వ‌త్తుకోవాలి. ఈ కార‌పూస‌ను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ఆర‌బెట్టుకున్న పెస‌ర్ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క‌ర‌క‌ర‌లాడుతూ అయ్యే వ‌ర‌కు వేయించుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి.

పెస‌ర్ల‌ను వేయించుకున్న త‌రువాత ప‌ల్లీల‌ను, జీడిప‌ప్పును కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన పెస‌ర్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార‌పూస‌ను ముక్క‌లుగా చేసుకుని వేసుకోవాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీలు, జీడిప‌ప్పు వేసుకోవాలి. తరువాత త‌గినంత ఉప్పు, కారం వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల మిక్చ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. ఈ మిక్చ‌ర్ ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts