POCO X4 Pro 5G : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన పోకో ఎక్స్‌4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌..!

POCO X4 Pro 5G : మొబైల్స్ త‌యారీదారు పోకో.. కొత్త‌గా పోకో ఎక్స్‌4 ప్రొ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే 5జి స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తోంది. అందువ‌ల్ల ఈ ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు.

POCO X4 Pro 5G smart phone launched
POCO X4 Pro 5G

పోకో ఎక్స్‌4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపున ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్‌-సి వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అందువ‌ల్ల ఈ ఫోన్ కేవ‌లం 15 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. అలాగే 41 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఇక ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999 ఉండ‌గా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 5వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్‌పై ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఇత‌ర పాత పోకో ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3000 వ‌ర‌కు అద‌నంగా డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts