వినోదం

Pokiri Movie : పోకిరి సినిమా క‌థ అస‌లు వేరే.. చాలా మార్పులు చేశారు..!

Pokiri Movie : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం పోకిరి. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2006 ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది. ఇలియనా, ప్రకాష్ రాజ్, నాజర్, అశీష్ విద్యార్థి కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మహేష్ కెరీర్‏లోనే అతి పెద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో గా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావ‌డం వెన‌క మ‌హేష్ పాత్ర త‌ప్ప‌క ఉంది. పూరి జగన్నాథ్ మహేష్ బాబుకు ఈ సినిమా కథను వినిపించే టప్పుడు పంజాబ్ కు చెందిన ఉత్తమ్ సింగ్ అనే ఓ అనాథ‌ పిల్లాడు మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అన్నది సినిమా కథ అని చెప్పాడట. ఈ సినిమా టైటిల్ ను ఉత్త‌మ్ సింగ్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని పూరి జగన్నాథ్ చెప్పారట. దాంతో పూరి పోకిరి అనే టైటిల్ ను చెప్పగా మహేష్ బాబుకు ఆ టైటిల్ చాలా నచ్చింది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తన భార్యను ముద్దుగా పిలుచుకునే పండు అనే పేరును మహేష్ బాబుకు పెట్టారట.

pokiri movie interesting facts to know

సినిమాలో ఇలియానాకు ముందు పార్వతీమెల్టన్ లేదంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తో అనుకున్నార‌ట‌. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇలియానా పేరు చెప్పడంతో ఆమె క‌థ‌కు సెట్ అవుతుంద‌ని తీసుకున్నార‌ట‌. ఈ చిత్రం 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోగా మహేష్ బాబు అన్ని సీన్ల‌లోనూ సింగిల్ టేక్ లోనే నటించడం విశేషం. ఎడిటింగ్ పూర్తైన త‌ర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ మ‌హేష్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. మొదటిరోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. కానీ తర్వాత సూప‌ర్ హిట్ అయింది. పోకిరి సినిమాతోనే అప్పట్లో మొదటిసారి ఒక ఇండస్ట్రీ రికార్డును తిరగ రాసిన మహేష్ బాబు ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమా అయితే చేయలేదు. భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు కానీ ఇలాంటి సినిమా రావాలి అని ఆడియన్స్ చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు.

Admin

Recent Posts