vastu

Stray Cat Visit To Your Home : వీధుల్లో తిరిగే పిల్లి స‌డెన్‌గా మీ ఇంటికి వ‌చ్చిందా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?

Stray Cat Visit To Your Home : సాధార‌ణంగా మ‌న దేశంలో పిల్లిని పెంచుకోవ‌డం అప‌శ‌కునంగా భావిస్తారు. న‌ల్ల పిల్లి ఎదురైతే ఆ రోజంతా ఎంతో కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని భావిస్తారు. దీంతో చేయ‌బోయే ప‌నిని కూడా ఆపేస్తారు. అలాగే ఎక్క‌డికీ ప్ర‌యాణాలు కూడా చేయ‌రు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం న‌ల్ల పిల్లి ఎదురైతే ఎంతో మంచిద‌ని భావిస్తారు. అయితే పిల్లుల గురించి కొన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు అనేక విశ్వాసాల‌ను పాటిస్తారు. ముఖ్యంగా ప్రాచీన ఈజిప్షియ‌న్లు పిల్లుల‌ను దైవ స్వ‌రూపంగా భావించేవారు.

పిల్లుల‌ను ఒక‌ప్ప‌టి ఈజిప్షియ‌న్లు ఇండ్ల‌లో పెంచుకునేవారు. వాటిని దైవంగా భావించి పూజించేవారు. పిల్లుల‌కు దుష్ట‌శ‌క్తులు క‌నిపిస్తాయ‌ని, క‌నుక అవి మ‌న ద‌గ్గ‌ర ఉంటే మ‌న వ‌ద్ద‌కు దుష్ట‌శ‌క్తులు రావ‌ని వారు భావిస్తారు. అందుక‌నే వారు పిల్లుల‌కు అంత ప్రాధాన్య‌త‌ను ఇచ్చేవారు. అయితే ఇప్పుడు చాలా మంది పిల్లుల‌ను పెంచ‌డం లేదు. కానీ వీధుల్లో మాత్రం మ‌న‌కు అప్పుడ‌ప్పుడు పిల్లులు క‌నిపిస్తుంటాయి. ఇవి ఎవ‌రి ఇంట్లోకి ప‌డితే వారి ఇంట్లోకి వెళ్ల‌వు. కేవ‌లం కొంద‌రి ఇళ్ల‌లోకే త‌ర‌చూ వెళ్తుంటాయి. ఇక కొంద‌రి ఇళ్ల‌లోకి అయితే వీధి పిల్లులు స‌డెన్‌గా వ‌చ్చేస్తుంటాయి. అయితే దీని వెనుక చాలా అర్థం ఉంద‌ని పండితులు చెబుతున్నారు.

what happens if stray cat visits your home

వీధుల్లో తిరిగే పిల్లి ఏదైనా స‌డెన్‌గా మీ ఇంట్లోకి వ‌చ్చిందంటే ఆ ఇంట్లోని వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అర్థ‌మ‌ట‌. ఆ పిల్లి వారికి ఏదో సందేశం ఇవ్వ‌డం కోస‌మే అలా స‌డెన్‌గా ఇంట్లోకి వ‌స్తుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి య‌జ‌మాని జీవితంలో అనేక మార్పులు వ‌స్తాయ‌ట‌. దాన్ని తెలియ‌జేయ‌డం కోస‌మే కొన్ని సార్లు వీధుల్లో తిరిగే పిల్లులు మ‌న ఇంట్లోకి స‌డెన్‌గా వ‌స్తాయ‌ట‌.

ఇక అలా పిల్లి వ‌చ్చిన‌ప్పుడు కుటుంబ య‌జ‌మాని జీవితంలో ఎలాంటి మార్పు అయినా రావ‌చ్చు. కానీ జీవితాన్ని మ‌లుపు తిప్పే మార్పులు జ‌రుగుతాయ‌ట‌. క‌నుక అలా గ‌న‌క ఎవ‌రి ఇంట్లోకి అయినా పిల్లి స‌డెన్‌గా వ‌స్తే అప్పుడు ఆ ఇంటి య‌జమాని అన్ని విధాలుగా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విష‌యంలో అస‌లు అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. అలాగే చేయ‌బోయే ప‌నుల విష‌యంలో కానీ లేదా ప్ర‌యాణాల విష‌యంలో కానీ అత్యంత జాగ్ర‌త్త తీసుకోవాలి. దీంతో జీవితంలో వ‌చ్చే ఎలాంటి మార్పుల‌ను అయినా ముందే ప‌సిగ‌ట్టి ఎదుర్కోవ‌చ్చు. ఇందుక‌నే పిల్ల‌లు కొన్ని సార్లు స‌డెన్‌గా మ‌న ఇంట్లోకి వ‌చ్చి ఈ విష‌యాన్ని గుర్తు చేస్తాయ‌ట‌. క‌నుక మీకు కూడా ఇలా జ‌రుగుతుంటే జాగ్ర‌త్త‌గా ఉండండి.

Admin

Recent Posts