హెల్త్ టిప్స్

శ‌రీరంలో ఎలాంటి నొప్పులు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే మ‌టుమాయం అవుతాయి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే అనేక రోగాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. పూర్వం మ‌న పెద్ద‌ల‌కు 60 ఏళ్లు దాటితే కానీ అనారోగ్యాలు వ‌చ్చేవి కావు. కానీ ఇప్పుడు 20 ఏళ్ల‌లోనే చాలా మందికి అనేక వ్యాధులు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఇక ప్ర‌స్తుతం చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి నొప్పుల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇందుకు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడ‌డంతోపాటు కింద చెప్పిన చిట్కాల‌ను ఫాలో అవ్వాలి. దీంతో నొప్పుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జ్యూస్, కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజుల పాటు చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కలబందలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.

follow these tips to remove body pains

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఇలా తాగటం వలన కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేస్తున్నా కూడా నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డతారు. ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా ప‌లు చిట్కాల‌తో నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts