చాలా మందికి ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్‌ను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను పెట్టాలి. దీంతో శుభం కలుగుతుంది.
ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లోని అందరిపై వరుణ దేవుడి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో అందరికీ ఉండే భయాలు, అసౌకర్యాలు తొలగిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో మధ్య వయస్కులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.