Pooja Hegde : పూజా హెగ్డె ఏంటి.. మ‌రీ ఇంత‌లా రెచ్చిపోయింది.. వీడియో..!

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న స‌క్సెస్ హీరోయిన్ల జాబితాను బ‌య‌ట‌కు తీస్తే అందులో పూజా హెగ్డె టాప్ 1 స్థానంలో ఉంటుంది. ఈమె గ‌త ఏడాదిలో న‌టించిన చిత్రాల‌న్నీ వ‌రుస‌గా హిట్ అయ్యాయి. దీంతో ఈ అమ్మ‌డు త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. ఇక ముంబైలో ఇటీవ‌ల ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. పూజా హెగ్డె ఈ మ‌ధ్య వ‌రుస‌గా మాల్దీవ్స్‌కు వెళ్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌ధ్య కాలంలో రెండు సార్లు అక్క‌డికి వెళ్లి వ‌చ్చింది. అయితే ఆ రెండు సార్లు ఒంట‌రిగానే ఆమె అక్క‌డ‌కు వెళ్లింది. కానీ తాజాగా త‌న ఫ్యామిలీని తీసుకెళ్లింది.

Pooja Hegde dancing on ship video viral
Pooja Hegde

ఇక మాల్దీవ్స్‌లో ఇటీవ‌ల వెకేష‌న్‌కు వెళ్లిన పూజా హెగ్డె ఒక రేంజ్ లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీంతో ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకు అంద‌రూ ఫిదా అయ్యారు. వ‌రుస‌గా ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రించింది. ఇక తాజాగా ఈమె షిప్‌లో ఎంజాయ్ చేస్తూ ర‌చ్చ చేసింది. ఈ వీడియోలో పూజా హెగ్డె రెచ్చిపోయి గ్లామ‌ర్ షో చేసింది. ఈ క్ర‌మంలోనే ఈమె వీడియో వైర‌ల్‌గా మారింది.

పూజా హెగ్డె తాజా వీడియోను చూసి నెటిజ‌న్లు అనేక ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్స్ అన్నాక గ్లామ‌ర్ షో చేస్తారు కానీ మ‌రీ పూజా హెగ్డె హ‌ద్దులు దాటుతుంద‌ని అంటున్నారు. ఇక ఈమె తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. అందులో నుంచి ఓ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. ఆ పాట‌లో పూజా హెగ్డె న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె డ్యాన్స్ స్టెప్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.

పూజా హెగ్డె తెలుగులో చివ‌రిసారిగా న‌టించిన చిత్రం.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఇందులో అక్కినేని అఖిల్ హీరోగా న‌టించారు. ఈ మూవీ బంప‌ర్ హిట్ అయింది. ఇక ఈమె రాధే శ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించింది. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అలాగే మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న ఓ మూవీలోనూ పూజా న‌టించ‌నుంది.

Share
Editor

Recent Posts