Poorna : క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేసిన న‌టి పూర్ణ‌.. అదిరిపోయిందిగా..!

Poorna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. స‌ర్కారు వారి పాట. ఈ మూవీలోంచి ఇటీవ‌లే క‌ళావ‌తి పాట‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. అందులో భాగంగానే ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు స్టెప్పులేశారు. మ‌హేష్ బాబు కుమార్తె సితార‌, ఆయ‌న సోద‌రి మంజుల ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. ఇక తాజాగా న‌టి పూర్ణ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. క‌ళావ‌తి పాట‌కు ఈమె త‌న‌దైన శైలిలో స్టెప్పులేసి అల‌రించింది.

Poorna danced for Kalaavathi song
Poorna

స‌ర్కారు వారి పాట చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు చెందిన క‌ళావ‌తి సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్ప‌టికే ఎన్నో కోట్ల వ్యూస్ ఈ పాట‌కు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించారు. సిద్ శ్రీ‌రామ్ గాత్రం అందించారు. ఇంట‌ర్నెట్‌లో ప్ర‌స్తుతం ఈ సాంగ్ సెన్సేష‌న‌ల్‌గా మారింది.

ఇక తాజాగా క‌ళావ‌తి పాట‌కు స్టెప్పులేసిన న‌టి పూర్ణ ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ బాబుకు ఆ వీడియోను ఆమె ట్యాగ్ చేసింది. కాగా మే 11వ తేదీన స‌ర్కారు వారి పాట చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Editor

Recent Posts