Potato Bajji : అంద‌రూ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఆలు స్నాక్స్‌.. ఇలా చేయండి..!

Potato Bajji : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల స్నాక్స్ ఐటమ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే రుచిక‌ర‌మైన స్నాక్స్ ల‌లో పొటాటో బజ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీలు మ‌న‌కు ఎక్కువ‌గా హోటల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భిస్తూ ఉంటారు. పొటాటో బ‌జ్జీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బ‌జ్జీల‌ను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వేడి వేడిగా ఈ బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని తింటూ వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అంద‌రికి న‌చ్చేలా పొటాటో బ‌జ్జీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 2, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, కారం – అర టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, వాము – అర టీస్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Potato Bajji recipe in telugu tasty snacks
Potato Bajji

పొటాటో బ‌జ్జీ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే చెక్కును తీసేసి వాటిని క‌త్తితో స్లైసెస్స్ గా క‌ట్ చేసుకోవాలి. ఈ ఆలై స్లైసెస్ మ‌రీ మందంగా మ‌రీ ప‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి. త‌రువాత వీటిని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసుకుని క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత బంగాళాదుంప స్లైసెస్ ను నీటిలో నుండి తీసి వ‌స్త్రంపై వేసి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆలూ స్లైసెస్ ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో బ‌జ్జీలు త‌యార‌వుతాయి. వీటిని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసి ఉల్లిపాయ‌, నిమ్మ‌ర‌సం, కొత్తిమీర‌, ఉప్పు, కారం, చాట్ మ‌సాలాతో స్ట‌ఫింగ్ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇలా అప్ప‌టిక‌ప్పుడు బంగాళాదుంప‌ల‌తో బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts