Potato Sandwich : బేక‌రీల‌లో ల‌భించే పొటాటో శాండ్ విచ్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Potato Sandwich : మ‌నం బ్రెడ్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో సాండం విచ్ ఒక‌టి. చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు మ‌నం అనేక ర‌కాల సాండ్ విచ్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం ఇంట్లో సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన సాండ్ విచ్ ల‌లో పొటాటో సాండ్ విచ్ కూడా ఒక‌టి. ఈ సాండ్ విచ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా దీనిని సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే పొటాటో సాండ్ విచ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొటాటో సాండ్ విచ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 4, బ్రెడ్ స్లైసెస్ – 4, ట‌మాట సాస్ – అర క‌ప్పు, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చాట్ మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌.

Potato Sandwich recipe in telugu very easy to prepare
Potato Sandwich

పొటాటో సాండ్ విచ్ త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను తురుముకోవాలి. త‌రువాత ఈ తురుములో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, కొత్తిమీర‌, ప‌సుపు, గ‌రం మసాలా, చాట్ మ‌సాలా, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైస్ ను తీసుకుంటూ వాటికి ఒక వైపు టమాట సాస్ ను రాసి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ట‌మాట సాస్ రాసిన బ్రెబ్ స్లైస్ ను ఒక దానిని తీసుకుని దానిపై ముందుగా త‌యారు చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మాన్ని అంత‌టా వ‌చ్చేలా స‌మానంగా ఉంచాలి. త‌రువాత దానిపై ట‌మాట కిచ‌ప్ రాసిన వైపు కిందికి వ‌చ్చేలా మ‌రో బ్రెడ్ స్టైస్ ను ఉంచాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి.

బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత సాండ్ విచ్ ను ఉంచి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌ర‌నువాత దీనిని రెండు లేదా నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో సాండం విచ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా అలాగే తిన్నా లేదా ట‌మాట కిచ‌ప్, మ‌య‌నీస్ వంటి వాటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఈ సాండం విచ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ పొటాటో సాండ్ విచ్ ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts