Puri Recipe : అంద‌రూ ఇష్టంగా తినేవిధంగా పూరీల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Puri Recipe : మ‌నం అల్పాహారంగా పూరీల‌ను కూడా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా మ‌రింత రుచిగా కూడా ఈ పూరీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీటిని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రింత రుచిగా, చ‌క్క‌గా పొంగే ఈ ర‌వ్వ పూరీలను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా ఉండే బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, వేడి నీళ్లు – ఒక కప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, వాము – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ఉడికించిన బంగాళాదుంప తురుము – అర క‌ప్పు, గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిపడా.

Puri Recipe everybody likes them make like this
Puri Recipe

ర‌వ్వ పూరీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత వేడి నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ర‌వ్వ‌ను అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, వాము, చిల్లీ ప్లేక్స్, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప తురుము వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ పూరీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి లేదా నూనె రాస్తూ పూరీలా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ పూరీని వేడి నూనెలో వేసి గంటెతో లోప‌లికి వ‌త్తుకోవాలి. పూరీ పొంగిన త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ పూరీలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా పూరీ కూర‌తో తిన్నా కూడా చాలా రుచిగాఉంటాయి. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఇలా మ‌రింత రుచిగా కూడా పూరీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts