Miriyala Pulihora Annam : మనం వంటల్లో మిరియాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఘాటు కోసం, రుచి కోసం వీటిని వాడుతూ ఉంటాము. మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొడిగా చేసి వంటల్లో వాడడంతో పాటు మిరియాలతో మనం ఎంతో రుచిగా ఉండే పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాలతో కమ్మగా, రుచిగా, పుల్ల పుల్లగా పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, మిరియాలు – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అన్నం – 2 కప్పులు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మకాయ – 1.
మిరియాల పులిహోర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి కలపాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిరియాలు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత అన్నం వేసి కలపాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల పులిహోర తయారవుతుంది. ఈ విధంగామిరియాలతో పులిహోరను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.