Holy Basil Root : పూర్వకాలం నుండి వస్తున్న అనేక పద్ధతులను, ఆచారాలను, విశ్వాసాలను ఇప్పటికీ కూడా మనం పాటిస్తూ ఉన్నాం. కొందరు మాత్రం ఈ ఆచారాలను మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటారు. ఈ పద్ధతులను, ఆచారాలను పాటించడం వల్ల మనకు మంచి జరిగినా జరగక పోయిన మనకు వచ్చే నష్టం మాత్రం ఏమీ లేదు. పురాతన కాలం నుండి వస్తున్న ఆ పద్ధతులు, ఆచారాలు, నమ్మకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలు మంగళ సూత్రాలకు పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నులను పెడుతూ ఉంటారు. ఇలా మంగళ సూత్రాలకు పిన్నులను పెట్టడం అంత మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. మంగళ సూత్రాలకు దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉంటుందని పిన్నీసుల వంటి వాటిని పెట్టడం వల్ల అవి ఆ శక్తిని కోల్పోయి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని వారు చెబుతున్నారు. ఇలా పిన్నీసులను ధరించడం వల్ల భర్త ఆయుష్షు కూడా తగ్గే ప్రమాదం ఉంటుందట. కనుక మంగళసూత్రాలకు పిన్నీసులను ఉంచే అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానుకోవాలి.
అలాగే స్త్రీలు మట్టి గాజులను ధరించడం అనేది కూడా మనకు పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలలో ఒకటి. స్త్రీలు మట్టి గాజులను ధరించడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యంతోపాటు ఆ కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, సుఖ శాంతులు కూడా నెలకొంటాయి. అదే విధంగా మన ఇంట్లో గుర్రం బొమ్మలను ఉంచకూడదు. ఒకవేళ ఉన్నా వెంటనే తొలగించాలి. గుర్రం బొమ్మలను ఉంచడం వల్ల ధనం ఎక్కువగా వృథా అవుతుంది. ధనం వచ్చినా కూడా నిలబడదు. అలాగే మనం మనకు ఉన్న ఆభరణాలను, సంపదను ఎక్కువగా ప్రదర్శించకూడదు. దీని వల్ల మనకు నర ఘోష, నర దిష్టి తగులుతుంది. కనుక ఎవరైనా కూడా సాధారణ అలంకరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా అత్తలు, ఆడపడుచులతో విభేదాలు ఉన్న వివాహితలు, వారితో ఇబ్బందులు పడుతున్న వివాహితులు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచాలి. దీంతో విభేదాలు తగ్గి మిమ్మల్ని ఎంతో అప్యాయంగా చూసుకుంటారు. పూర్వకాలంలో ఎక్కువగా నమ్మిన విశ్వాసాలలో ఇది కూడా ఒకటి.
అలాగే వంట చేసేటప్పుడు స్త్రీలు భక్తితో రెండు బియ్యం గింజలను అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనం చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. భర్త మద్యానికి బానిన అయి ఇంట్లో గొడవ చేస్తూ ఉంటే వారి చేత అర గ్రాము కరక్కాయ పొడిని ఆరు చెంచాల నీటిలో కలిపి ఆ నీటిని ఉదయం అల్పాహారం అయిన తరువాత వారిచే తాగించాలి. ఇలా అరవై రోజుల పాటు చేయడం వల్ల మద్యం తాగే అలవాటు పోతుంది. సుఖ శాంతులు కరువైన వారు పసుపు రంగు పూలను ధరించాలి. అప్పులు ఎక్కువైన వారు తెలుపు రంగు పూలను ధరించాలి. ఇలా చేయడం వల్ల రుణ బాధలు పోతాయి.
ఆరోగ్యం బాగాలేని వారు, అలాగే నొప్పులతో బాధపడే వారు మర్మాన్ని, మందార పూలను కలిపి ధరించాలి. వివాహం కాని స్త్రీలు ఎరుపు, పసుపు రంగు పూలను కలిపి ధరించాలి. ఇలా చేయడం వల్ల వివాహ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. భర్త బయటకు వెళ్లడానికి చొక్కాను ధరిస్తూ ఉంటే ఆ చొక్కా గుండీలను భార్య పెట్టాలి. బయటకు వెళ్లే పురుషులు భార్య కుడి చెయ్యిన తాకి వెళితే ఆ రోజంతా మంచి ఫలితం ఉంటుంది. వీటన్నింటినీ మూఢ నమ్మకాలని అనే వారు ఉంటారు. అలాగే వీటిని పాటించే వారు ఉంటారు. మనం ఏం చేసినా మన కుటుంబ సంతోషం కోసమే చేస్తూ ఉంటాం. కనుక వీటిని పాటించడం పాటించకపోవడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఆచారాలను పాటించడం వల్ల మనకు మంచి జరగకపోయినా ఎటువంటి చెడు మాత్రం జరగదు. కనుక వీటిని పాటిస్తే మేలు పొందవచ్చు.