vastu

Shankhuvu : మీ ఇంట్లో శంఖువును ఇలా పెట్టండి.. మ‌హాల‌క్ష్మి సంతోషించి క‌రుణిస్తుంది..!

Shankhuvu : హిందూ మతంలో కొన్ని వ‌స్తువుల‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. వాటికి ప్ర‌త్యేకంగా పూజ‌లు కూడా చేస్తూ ఉంటారు. ఇలా ప‌విత్రంగా భావించే వ‌స్తువుల‌ల్లో శంఖం కూడా ఒక‌టి. హిందూ మ‌త గ్రంథాల ప్ర‌కారం స‌ముద్ర మ‌థ‌నం స‌మ‌యంలో ల‌క్ష్మీదేవి జ‌న్మించింది. అనంత‌రం శంఖాన్ని స్వీక‌రించారు. ఈ కార‌ణం చేత శంఖాన్ని కూడా చాలా ప‌విత్రంగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవ‌డం చాలా శుభ‌ప్ర‌ద‌మైన‌దిగా భావిస్తారు. చాలా మంది ఇంట్లో శంఖాన్ని ఉంచుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు. శంఖం నుండి వ‌చ్చే ధ్వ‌నితో ఇంట్లో ఉండే ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోతాయని చాలా మంది విశ్వ‌సిస్తారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికి ఎలా ప‌డితే అలా శంఖాన్ని ఉంచ‌కూడదు.

ఇంట్లో శంఖం ఉంటే కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాలి. ఈ నియ‌మాల‌ను పాటించ‌కుంటే మంచి జ‌ర‌గ‌డానికి బ‌దులుగా చెడు జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇంట్లో శంఖాన్ని ఉంచుకునే వారు పాటించాల్సిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొర‌పాటున కూడా శంఖాన్ని నేల‌పై ఉంచ‌కూడ‌దు. శంఖాన్ని నేల‌పై ఉంచ‌డం అంటే శంఖాన్ని అవ‌మానించిన‌ట్టే. శంఖాన్ని ఎల్ల‌ప్పుడూ పీట‌పై ఉంచాలి. క‌టిక నేల‌పై ఉంచకూడ‌దు. అలాగే శంఖాన్ని ఉప‌యోగించిన త‌రువాత శుభ్రం ఉంచాలి. శంఖంపై నీటి చుక్క కూడా లేకుండా చూసుకోవాలి. నీటి చుక్క‌ల కార‌ణంగా శంఖానికి న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చు. అలాగే శంఖాన్ని ఎల్ల‌ప్పుడూ పూజ గ‌దిలోనే ఉంచాలి. ల‌క్ష్మీ, విష్ణువు ద‌గ్గ‌ర శంఖాన్ని ఉంచ‌డం మంచిది.

put shankuvu in your home for wealth

అలాగే శంఖాన్ని ఎల్ల‌ప్పుడూ గుడ్డ‌తో క‌ప్పి ఉంచాలి. అదేవిధంగా ఇంటికి శంఖాన్ని ఎప్పుడు ప‌డితే తీసుకురాకూడదు. శివ‌రాత్రి, న‌వ‌రాత్రి స‌మ‌యంలోనే ఇంటికి శంఖాన్ని తీసుకురావాలి. ఈ రోజుల్లో శంఖాన్ని ఊద‌డం వ‌ల్ల సుఖ సంతోషాలు, ఐశ్వ‌ర్యం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. అలాగే శంఖాన్ని ఊదిన త‌రువాత శుభ్రం చేయ‌డం చాలా అవ‌స‌రం. శంఖం ఎల్ల‌ప్పుడూ స్వ‌చ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. శంఖాన్ని ఊదిన త‌రువాత గంగాజ‌లంతో లేదా నీటితో శుభ్రం చేసి త‌డి లేకుండా గుడ్డ‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయేడం వ‌ల్ల శంఖం స్వ‌చ్చంగా ఉంటుంది. అలాగే శంఖాన్ని ఎల్ల‌ప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. శంఖం యొక్క ఓపెన్ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో సానుకూల‌త పెరిగి నెగిటివిటీ తగ్గుతుంది.

Admin

Recent Posts