Wealth Tips : జోతిష్య శాస్త్రంలో మనల్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడేసే అనేక నివారణ మార్గాలు ప్రస్తావించబడ్డాయి. ఈ నివారణ మార్గాలను పాటించడం వల్ల మన జీవితంలో వచ్చే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. డబ్బుకు కొరత ఉండదు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటుంది. జోతిష్య శాస్త్రంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడేసే అనేక నివారణ మార్గాలల్లో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిష్కారాన్ని రహస్యంగా చేస్తే తక్కువ సమయంలోనే డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. కుటుంబంలో అన్ని వేళలా సంతోషం ఉంటుంది.
ధనవంతులు కావాలనుకునే వారు ఈ నివారణ మార్గాన్ని అనుసరించడం వల్ల సురక్షితంగా సరైన మార్గంలో ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. జోతిష్యశాస్త్ర ప్రకారం ఇంట్లోకి డబ్బును ఆకర్షించాలంటే ఇంట్లో గణేశుడి మరియు లక్ష్మీ దేవి యొక్క మిళిత యంత్రాన్ని రహస్యమైన చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం చేయడం వల్ల మనకు రావాల్సిన డబ్బులు వెంటనే మనకు చేరుతాయి. దీనితో పాటు శ్రీ మహావిష్ణువు ముందు కూర్చుని, ముకుళిత హస్తాలతో ఆయనను హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని రోజూ జపించాలి. అదే విధంగా జోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చీమలకు పిండి, పంచదార కలిపి ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది.
డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే డబ్బు సంబంధిత సమస్యలతో పాటు ఇతర సమస్యలతో బాధపడే వారు రోజూ 108 సార్లు దుర్గా దేవి మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీరు కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను చేయడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు జీవితంలో వచ్చే ఇతర సమస్యల నుండి కూడా బయటపడవచ్చని జోతిష్య శాస్త్రం చెబుతుంది.