Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధే శ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించి దూసుకుపోతోంది. పాత కాలం నాటి లవ్ స్టోరీ అంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే అద్భుతమైన లొకేషన్లను ఇందులో చూపించారు. దీంతో రాధే శ్యామ్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఇక థియేటర్లలో అలరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏ సినిమా విడుదల అయినా సరే 4 నుంచి 6 వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల రాధేశ్యామ్ కూడా నెల రోజుల్లో ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 11 తరువాత దీన్ని ఓటీటీలోకి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు ఇన్ని రోజుల తరువాతే ఓటీటీలోకి రావాలి.. అనే నియమం ఏమీ విధించలేదు. కనుక అంతకన్నా ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
ఇక రాధేశ్యామ్ సినిమాకు గాను డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర భాషలకు చెందిన వెర్షన్లను కొనుగోలు చేసేందుకు పలు ఇతర ఓటీటీ యాప్స్ ప్రయత్నిస్తున్నాయట. అందువల్ల కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే అమెజాన్ లోకి వస్తుందని అంటున్నారు. అలాగే ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ ఉంది కనుక ఆ రోజు ఈ సినిమాను స్ట్రీమ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది.