Mouth Ulcer : నోట్లో పుండ్లు ఉన్నాయా ? ఇలా చేస్తే ఒక్క రోజులోనే త‌గ్గిపోతాయి..!

Mouth Ulcer : సాధార‌ణంగా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. అధికంగా వేడి ఉన్నా.. కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను తిన్నా.. వేడి వేడి ప‌దార్థాల‌ను తిని నోరు కాలినా.. ఇలా భిన్న సంద‌ర్భాల్లో నోట్లో పుండ్లు ఏర్ప‌డుతుంటాయి. కొన్ని సార్లు గుల్ల‌ల రూపంలో వ‌చ్చి ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా పెద‌వుల లోప‌లి వైపు లేదా నాలుక‌పై ఏర్ప‌డుతుంటాయి. అయితే వీటిని కేవ‌లం ఒక్క రోజులోనే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

this is the best remedy for Mouth Ulcer
Mouth Ulcer

ప‌సుపును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నీరు క‌లిపి చిక్క‌ని పేస్ట్‌లా త‌యారు చేయాలి. ఆ త‌రువాత దాన్ని నోట్లో పుండ్లు ఉన్న చోట రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం య‌థావిధిగా దంతాల‌ను తోముకోవాలి. ఇలా ఒక్క రోజు చేస్తే చాలు.. నొప్పి, మంట మొత్తం పోతాయి. రెండో రోజు చేస్తే పూర్తిగా పుండు త‌గ్గిపోతుంది. నోట్లో ఏర్ప‌డే పుండ్ల‌కు ఇది అత్యుత్త‌మ చిట్కాగా ప‌నిచేస్తుంది.

ప‌సుపులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల పుండ్ల‌ను చాలా త్వ‌ర‌గా న‌యం చేస్తుంది. క‌నుక ప‌సుపును ఈ విధంగా ఉప‌యోగిస్తే నోట్లో పుండ్లు మాత్ర‌మే కాదు.. శ‌రీరంపై ఏర్ప‌డే పుండ్లు, గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.

Admin

Recent Posts