Ragi Atukulu : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులను పూర్వకాలంలో ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకునే వారు. అందుకే మన పూర్వీకులు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించేవారు. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాగులను మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటిని రవ్వగా, పిండిగా చేసి వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటు ఈ మధ్యకాలంలో రాగులతో అటుకులు కూడా తయారు చేస్తున్నారు. మనకు సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో, చిరుధాన్యాలు అమ్మే దుకాణాల్లో ఇవి మనకు లభిస్తున్నాయి. రాగుల వలె రాగి అటుకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మనం తరుచుగా తీసుకునే అటుకులకు బదులుగా రాగి అటుకులను తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రాగిఅటుకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో స్మూతీని చేసి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రాగి అటుకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి… అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ అటుకులతో స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాగి అటుకులు కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.
రాగి అటుకులతో తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణసంబంధిత సమస్యలు ఉన్న వారు రాగులకు బదులుగా రాగి అటుకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో స్మూతీని తయారు చేసి తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. రాగి అటుకులతో స్మూతీని తయారు చేయడం చాలా సులభం.
రాగి అటుకులతో స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి గానూ జార్ లో రుచికి తగినంత పటిక బెల్లం, నానబెట్టిన చియా విత్తనాలు, నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో ఒక కప్పు రాగి అటుకులు వేసి కలిపి తినాలి. ఇలా రాగి అటుకులతో స్మూతీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనంసులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఆరోగ్యాని కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా రాగిఅటుకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.