Ram Charan : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినా.. రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేదుగా..!

Ram Charan : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గురువారం అర్థారాత్రే హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల బెనిఫిట్ షోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం తెల్ల‌వారుజాము వ‌రకు రివ్యూలు వ‌చ్చేశాయి. సినిమా అద్భుతంగా ఉంద‌ని.. రాజ‌మౌళి మ‌రో హిట్ కొట్టార‌ని ప్ర‌శంసిస్తున్నారు. అయితే ఇంతటి భారీ మూవీ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్‌కు రిలీఫ్ అనేది లేకుండా పోయింది.

Ram Charan will be very busy in few days
Ram Charan

రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు. అందువ‌ల్ల ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయినా ఆయ‌న ఊపిరి తీసుకుని రిలీఫ్ ఫీల‌య్యే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే వ‌చ్చే నెల‌లో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అలాగే వ‌చ్చే నెల‌లో.. అంటే.. ఏప్రిల్ 29వ తేదీన ఆచార్య మూవీ రిలీజ్ ఉంది. అందులో చిరంజీవి, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ న‌టించారు. అందువ‌ల్ల ఓ వైపు శంక‌ర్ సినిమాలో న‌టిస్తూనే మ‌రో వైపు ఆచార్య ప్ర‌మోషన్ల‌లో పాల్గొనాల్సి ఉంటుంది. క‌నుక రామ్ చ‌ర‌ణ్‌కు ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమా రిలీజ్ అయినా.. రిలీఫ్ అనేది లేద‌నే చెప్పాలి.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి చ‌ర‌ణ్‌కు హిందీ మార్కెట్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. క‌నుక ఆచార్య మూవీని కూడా హిందీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అందువ‌ల్ల అక్క‌డ కూడా చ‌ర‌ణ్ స్వ‌యంగా ప్ర‌మోష‌న్స్ చేయాల్సి ఉంటుంది. క‌నుక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినా.. చ‌ర‌ణ్ ఖాళీగా ఉండ‌డ‌ని.. ఇంకా బిజీగా మారిపోతాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌రోవైపు ఆర్ఆర్ఆర్‌లో ఇంకో హీరోగా న‌టించిన ఎన్‌టీఆర్‌కు మాత్రం ఈ మూవీతో కాస్త రిలీఫ్ ల‌భించింది. ఆయ‌న మ‌రో రెండు మూడు రోజుల్లో చిన్న వెకేష‌న్‌కు వెళ్లి వ‌స్తార‌ని తెలుస్తోంది. త‌రువాత కొర‌టాల శివ‌తో క‌లిసి సినిమా చేస్తార‌ని స‌మాచారం.

Share
Editor

Recent Posts