Figs : అంజీర్ పండ్లు మనకు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. ఇవి చూసేందుకు ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండవు. కానీ వీటితో అనేక లాభాలు కలుగుతాయి. అంజీర్ పండ్లను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ 5-6 అంజీర్ పండ్లను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజూ వీటిని తింటే అద్భుతమైన ఉపయోగాలు కలుగుతాయి. అంజీర్ పండ్లతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అంజీర్ పండ్లను రోజూ ఉదయాన్నే తింటే శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఉదయాన్నే వీటిని తింటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు. అలాగే రోజంతా నీరసం, నిస్సత్తువ ఉందని భావించేవారు.. ఈ పండ్లను తింటే శక్తివంతులుగా మారుతారు. నీరసం మొత్తం పోతుంది. చురుకుదనం వస్తుంది.
2. అంజీర్ పండ్లను తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అయిన లివర్ కూడా మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా మారుతుంది.
3. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉన్నవారు రోజూ అంజీర్ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఆయా సమస్యలు తగ్గుతాయి.
4. అంజీర్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. గుండె సురక్షితంగా ఉంటుంది.
5. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.